నైట్ క్లబ్ వివాదం.. స్టోక్స్, అట్కిన్సన్పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వేటు
- నైట్‌క్లబ్ ఘటనపై కొనసాగుతున్న విచారణ
- కర్ఫ్యూ ఉల్లంఘన ఆరోపణలు
- రెండో టెస్టుకు దూరం చేసిన ఈసీబీ
- జో రూట్‌కు కెప్టెన్సీ
- ఆర్చర్, జోర్డాన్ కాక్స్ అవకాశం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, స్టార్ పేసర్ అట్కిన్సన్‌లను రెండో టెస్టు నుంచి తప్పించినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.
లండన్‌లోని లార్డ్స్ మైదానంలో తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత స్టోక్స్, అట్కిన్సన్ జట్టు సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. నివేదికల ప్రకారం ఇంగ్లాండ్ జట్టుకు అర్ధరాత్రి తర్వాత బయట తిరగొద్దనే నిబంధన అమల్లో ఉంది. అయితే స్టోక్స్, అట్కిన్సన్ ఆ నిబంధనను ఉల్లంఘించి నైట్‌క్లబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఓ రగ్బీ ఆటగాడితో వాగ్వాదం జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై ఈసీబీతో పాటు స్వతంత్ర క్రికెట్ రెగ్యులేటర్ కూడా విచారణ చేపట్టింది.
అయితే ఈ వ్యవహారంలో స్టోక్స్, అట్కిన్సన్ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. వారు గొడవను ప్రారంభించలేదని కొన్ని బ్రిటిష్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ జట్టు నిబంధనల ఉల్లంఘనపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 17 నుంచి ఓవల్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ఇద్దరినీ ఎంపిక చేయలేదు.
మాజీ సారథి జో రూట్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. స్టోక్స్, అట్కిన్సన్ల స్థానాల్లో జోఫ్రా ఆర్చర్, జోర్డాన్ కాక్స్లకు అవకాశం కల్పించారు. విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరి భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.